న్యూఢిల్లీ: భారత్ పురోగతి భారీగా తమ సముద్ర జల మార్గాలతో ముడిపడి ఉందని, అడ్డంకులు లేని సముద్ర మార్గాలు దేశ ముఖ్య అవసరాల్లో ఒకటని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ శనివారం పేర్కొన్నారు. మనకు సుదీర్ఘకాలం నుంచి సముద్ర జలాలతో సన్నిహిత సంబంధం ఉందని, మన వాణిజ్యం, ఆర్థికం, పండగలు, సంస్కతి వ్యవహారాలు సముద్రాలతోనే అతి సన్నిహితంగా ముడి పడి ఉన్నాయని ఆయన వివరించారు. అయితే సముద్రాలకు సంబంధించి అనేక సవాళ్లు మనకు ఎదురవుతున్నాయని చెప్పారు. భారత తీర రక్షణ దళ వ్యవస్థాపక (ఐసిజి( దినోత్సవం సందర్భంగా రాజ్‌నాధ్ ప్రసంగించారు. తీర ప్రాంత భద్రత, లేకుంటే సమగ్ర అంతర్గత, బహిర్గత భద్రత సాధించలేమని సవాళ్లు మనకు చెబుతున్నాయని పేర్కొన్నారు. మన సాగర జోన్ల భద్రత తోనే మన భద్రతావసరాలు, కాలుష్య రహిత పర్యావరణ ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉన్నాయని వివరించారు. ఈ సవాళ్లన్నిటినీ ఐసిజి పరిష్కరిస్తుండడం తనకు సంతోషంగా ఉందన్నారు.
దేశాభివృద్ధికి అడ్డంకులు లేని సముద్రమార్గాలు ముఖ్యం: రాజ్‌నాధ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -