Saturday, November 23, 2024

మనసు సక్రమంగా ఉంటేనే ప్రశాంత జీవితం

- Advertisement -
- Advertisement -
World Mental Health Day 2021 
ఉరుకుల పరుగుల జీవనంలో జాగ్రత్తలు అవసరం
 అనవసర ఆలోచనలతో తీవ్రముప్పు
 నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

హైదరాబాద్ : ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడు. ఆరోగ్యం బాగుంటే అంతా బాగుంటుం ది. కాని నేడు మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. అప్పటి కాలాన్ని అన్వయించుకుని నాటి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకటే టెన్షన్.. టెన్సన్.. ఉరుకులపరుగల జీవితం. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గపడలేని దయనీయత. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రపం చ ఆరోగ్య సంస్థ.. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవా న్ని ఏటా అక్టోబర్ 10న జరుపుకోవాలని ప్రకటించింది. ప్రపంచం ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేక అంగవైకల్యం లేకపోవడం మా త్రమే కాక సంపూర్ణ శారీరక మానసిక సామాజిక స్వస్థతని కలిగి ఉండటం. మానసిక ఆరోగ్యం అనేది ప్రతి వ్య క్తికి సంబంధించిన విషయం. మానసిక ఆరోగ్యం అంటే ఒక విధంగా భావోద్వేగ ఆరోగ్యం. వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తన సొంత సమస్యలను గుర్తించడం సాధారణ వ్యక్తులను అధిగమించ డం ఉత్పాదకత గల పని చేయడం సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అనేవి మానసిక ఆరోగ్య సూచిక.

దినోత్సవం ఇందుకే..

మన ఆలోచనలు.. ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధార పడి పనిచేస్తుంటాయి. మెదడు లేకుంటే శరీరం ఇంజన్‌లేని రైలు, దారం లేని గాలి పటం అవుతుంది. మనకర్తవ్యాలను నెరవేర్చుకుంటూ లక్ష్యాలను చేరి ఆనందంగా జీవించేందుకు ఇతర శారీక అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. ఇందుకోసం అవగాహన ఏర్పరచుకునేందుకు, అప్రమత్తంగా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు రచించుకునేందుకు, జా గ్రత్తలు ఏవో తెలుసుకుని పాటించటానికి ఉద్దేశించినదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్యదినోత్సం.

మానసిక ఆనారోగ్యాన్ని ఆశ్రద్ధ చేస్తే..

మానసిక ఆనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్సను మధ్యలోనే ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొ న్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనుక అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ దృఢంగా ఉండేలా చూసుకోవాలి. అప్రమత్త ంగా ఉండేందుకు వసరమైన అంశాలను తెలుసుకోవాలి. మానసిక రోగం పేరుచెబితే చాలు మనందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా భయం వల్లనే వణికిపోతాం. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో వింత పోకడలు ఉన్న వారు కనిపిస్తు ంటారు. ఒకరికి తిండి పిచ్చి, నగల పిచ్చి, డబ్బు సంపాది ంచాలనే పిచ్చి, సినిమాలు విపరీతంగా చూడటం, గొప్ప లు చెప్పుకునేపిచ్చి, ఆడంబరాలకు పోయే పిచ్చి ఇలా ఎ న్నో రకాల మానసిక రుగ్మతలు ఉన్న వారు మన చుట్టూనే కనిపిస్తుంటారు. ఏ లక్షణమైన అవధులు దాటితే అవి పిచ్చి చేష్టలే అవుతాయి.

మానసిక వైకల్యాలు అనేక విధాలు..

వైద్య పరిభాషలో మానసిక వైకల్యాలను పలు రకాలుగా చెప్పారు. డిప్రెషన్, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్దర్, పానిక్ డిజార్డర్, అబ్సెసిస్ కంపల్సెవ్ డిజార్డర్, పోస్టు ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్దర్, ఫోబియా, మానియా, స్కిజోప్రినియా, డిల్యూషన్ డిజార్డర్, స్లిప్ డిజార్డర్, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు ఉన్నాయి. స్థూలం గా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేక పోవడమే రుగ్మతలను తెచ్చిపెడుతోంది. కష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో కుంగి పోకుండా బ్యాలెన్సుగా ఉండగలిగితే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. ఒత్తిడికి గురికాకుం డా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలనే గాని ఆం దోళనకు గురికాకూడదంటారు మానసిక వైద్యనిపుణులు.

మానసిక ఆరోగ్యంపై కొవిడ్ ప్రభావం

కొవిడ్ 19 మహమ్మారితో ప్రపంచం అంతా పోరాడుతు న్న ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉ ందని నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్ 19 మానవ అ భివృద్ధిలో జరుగుతున్న అసమానతలను మరింత పెం చి ంది. ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టింది. మరోవైపు ఈ మహమ్మారి వల్ల పెరిగిన మానసిక ఆరోగ్య సమస్యలు వల్ల ఇప్పటికే పరిమితంగా ఉన్న మానసిక ఆరోగ్య విభాగాలపై మరింత ఒత్తిడి పెంచింది. కొవిడ్‌కి ముందు కూ డా భారతదేశంలో ప్రతి ఏడుగురు పౌరుల్లో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని గు ర్తించారు. 2017లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మ నదేశంలో సుమారు 20 కోట్ల మం ది ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. అందు లో 80శాతం మంది అంటే సుమారు 16కోట్ల మంది ఏ రకమైన చికిత్స కూడా తీసుకోవడం లేదు. వారిలో చాలామందికి తాము మానసిక ఆరో గ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా తెలియదు. మన దేశంలో మానసిక ఆ రోగ్యం ఈ విషయంలో గల అపోహల వల్ల విద్య, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో బా ధాకరమైన అంశం ఏమిటంటే ప్రపంచంలో ప్రతీ నాలు గు ఆత్మహత్యల్లో ఒకటి మన దేశంలో జరుగుతుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిం ది. ఇం దులో భాగంగా రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికి సర్వే నిర్వహించి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వ్య క్తులను గుర్తించారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో సైకియాట్రిస్ట్ సహకారంతో కౌన్సెలింగ్ సేవలు, ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందిస్తారు.

తీవ్ర వ్యాధిగ్రస్తులను జిల్లా కేంద్రం ఆసుపత్రిలో గల అసంక్రమిత వ్యాధుల కేంద్రాలకు రెఫర్ చేస్తారు. 2019 ఆగస్టు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రస్తుతం 21 ఒక్క జిల్లాలో వైద్య విధాన పరిష త్, జాతీయ ఆరోగ్య మిషన్ సైకియాట్రిస్ట్ ఆధ్వర్యం లో సేవలు అందించబడుతున్నాయి. వ్యాధిగ్రస్తులు త్వరగా గుర్తించడం పూర్తిస్థాయి చికిత్స అందించడం వ్యాధి నియంత్రణ దీని ముఖ్య లక్ష్యాలు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం దశల వారీగా ప్రారంభించబడుతుంది. కొవిడ్ 19 మహమ్మారి సమయం లో ప్రజలు ఎదుర్కొన్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 టోల్ ఫ్రీ సేవ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News