Saturday, November 23, 2024

ఇరాక్ కొత్త పార్లమెంటుకు ఓటింగ్

- Advertisement -
- Advertisement -

Iraq parliament election

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్, దక్షిణ ప్రాంతంలో 2019 చివర్లో జనాగ్రహం పెరగడంతో వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలను ముందుకు తెచ్చారు. దాంతో ఇరాక్ ఓటర్లు ఆదివారం ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓ దశాబ్దంపాటు ఘర్షణలు, అధికార దుర్వినియోగం వంటివి పెల్లుబికిన నేపథ్యంలో ఇరాకీలు కొందరు సంస్కరణలు వస్తాయన్న ఆశతో ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఇరాక్‌లో అవినీతి, సేవలు అధ్వానంగా తయారవడం, నిరుద్యోగం పెరిగిపోవడం నేపథ్యంలో 2019 చివర్లో వేలాది మంది ఆందోళనలకు దిగారు. రక్షక దళాలు వారి మీదకు బాష్పవాయువులు, కాల్పులు వంటివి జరిపినా వారు వెరవలేదు. గత కొన్ని నెలల్లో దాదాపు 600 మంది చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. చివరికి అధికారులు వీలయినంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
అనేక అపహరణలు, హత్యలు చోటుచేసుకోవడంతో ఇరాకీలు కాస్త అధైర్యానికి గురయ్యారు. బాగా స్థిరపడి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులు పోటీచేయడానికి సందేహించారు.
బాగ్దాద్‌కు చెందిన కర్రాదా జిల్లాలో తన ఓటును ఆదివారం వినియోగించుకున్న 22 ఏళ్ల కారు డీలర్ ఆమీర్ ఫదేల్ “మార్పు కోసం నేను ఓటేశాను. ఇవే పార్టీలు, ఇవే ముఖాలు నేను వద్దనుకుంటున్నందుకే ఓటేశాను” అన్నారు.
ఇరాక్‌లో 329 పార్లమెంటు స్థానాలకు మొత్తం 3449 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి తర్వాత, అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ పతనం తర్వాత జరుగుతున్న ఆరవ పార్లమెంటు ఎన్నికలు ఇవి. ఓటింగ్ సక్రమంగా జరగడానికి 2,50,000 భద్రతా బలగాన్ని దేశవ్యాప్తంగా నియుక్తించారు. పోలింగ్ స్టేషన్ల ముందు సైనికులు, పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక సిబ్బందిని నియమించారు. కొన్ని చోట్ల ముళ్లతీగలను కూడా ఉంచారు.

ఓటర్లు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి ఓటేయాలని ఇరాక్ అధ్యక్షుడు బర్హామ్ సలీహ్, ప్రధాని ముస్తఫా అల్-కధీమీ కోరారు. ఇదిలావుండగా ఇరాక్ మొదటిసారి బయోమెట్రిక్ ఓటరు కార్డులను ప్రవేశపెట్టింది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఓట్లు కొనడం, భయపెట్టడం, తారుమారు చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News