Saturday, November 23, 2024

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -
Centre allows export of made in india sputnik light covid
రష్యాకు 40 లక్షల డోసులు ఎగుమతి చేయనున్న హెటెరో బయోఫార్మా

న్యూఢిల్లీ : భారత్‌లో తయారవుతున్న రష్యా సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు భారత దేశంలో అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదించ లేదు. దాంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇచ్చింది. రష్యాకు 40 లక్షల డోసుల స్పుత్నిక్ లైట్ ను ఎగుమతి చేయడానికి భారత్‌కు చెందిన ఔషధ సంస్థ హెటెరో బయోఫార్మా సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ అనేది రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కాంపొనెంట్ 1 వలె ఉంటుంది. ఇది ఏప్రిల్‌లో భారత ఔషధ నియంత్రణ విభాగం నుంచి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందింది. దాంతో భారత్ లోని యాంటీకొవిడ్ టీకాల్లో ఈ టీకాను కూడా చేర్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో రష్యన్ డైరెక్టు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) భాగస్వాములలో ఒకరైన హెటిరో బయోఫార్మా ఉత్పత్తి చేసే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు ఇక్కడ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే వరకు తమ దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతించాలని రష్యన్ రాయబారి భారత ఔషధ నియంత్రణ కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరారు.

స్పుత్నిక్ వి మిలియన్ డోసులు, స్పుత్నిక్ లైట్ రెండు మిలియన్ డోసులను హెటెరో బయోఫార్మా సంస్థ ఇప్పటికే ఉత్పత్తి చేసిందని కేంద్రానికి పంపిన లేఖలో రష్యన్ రాయబారి నికొలయ్ కుడాషెవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఆరు నెలల షెల్ఫ్ జీవితం త్వరలో ముగుస్తున్నదని, రిజిస్ట్రేషన్‌కు మందు టీకా మోతాదులు వృధా అవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యాకు 40 లక్షల మోతాదుల స్పుత్నిక్ లైట్‌ను ఎగుమతి చేయడానికి హెటిరో బయోఫార్మాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. 2020 డిసెంబర్ 5 నుంచి 2021 ఏప్రిల్ 15 వరకు రష్యా సామూహిక టీకా డ్రైవ్‌లో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 79.4 శాతం సమర్ధత చూపించినట్టు . అనేక డబుల్ డోసు వ్యాక్సిన్లు కన్నా సమర్ధత స్థాయి 80 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ప్రయోగశాల పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ కొత్త వేరియంట్లను కూడా నియంత్రించ గలదని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News