- Advertisement -
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
వారణాసి: లఖింపుర్ ఖేర్ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడు గా పేర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడిని రక్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నియోజక వర్గమైన వారణా సిలో కిసాన్ న్యాయ్ ర్యాలీ సందర్భంగా ఆమె ప్రసంగించారు. లఖింపుర్ దుర్ఘటనకు నిరసనగా ఈ ర్యాలీ జరిగింది. ప్రధాని మోడీ దేశ విదేశాలు తిరుగుతుంటారని, కానీ తన నివాసానికి పది నిముషాల దూరంలో నిర సన పాటిస్తున్న రైతులతో మాట్లాడడానికి తీరుబాటు దొరకడం లేదని వి మర్శించారు. లక్నోలో ఎగ్జిబిషన్‌ను మోడీ ఇటీవల సందర్శించారని, కానీ లఖింపుర్ ఖేరిని మాత్రం సందర్శించలేక పోయారని వ్యాఖ్యానించారు.
- Advertisement -