శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఓ ఉగ్రవాది మరణించాడు.
మరోవైపు, అనంత్‌నాగ్ జిల్లాలోని వెరినాగ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
2 Terrorists killed by Security Forces Encounter