- Advertisement -
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్‌లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి యష్‌పాల్ ఆర్య, ఎంఎల్‌ఏ అయిన ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.ఆరుసార్లు ఎంఎల్‌ఏగా ఉన్న ప్రముఖ దళిత నాయకుడు యష్‌పాల్ ఆర్య, పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇదివరలో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరారు. నాడు ఆయన ముఖ్యమంత్రి హరీష్ రావత్ పనితీరు నచ్చక బిజెపిలోకి వెళ్లారని సమాచారం. కానీ వాస్తవానికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయన కుమారుడిని నిలబెట్టకపోవడమేనని అనుకుంటున్నారు. నాడు బిజెపి ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యను నైనితాల్ నుంచి ఎన్నికల బరిలో నిలిపింది. అప్పుడా యన ఆ సీటును గెలుచుకున్నారు.
- Advertisement -