- Advertisement -
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 96.75 కోట్ల డోసులకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికీ 8.43 కోట్ల డోసులకు పైగా ఉపయోగించవలసిన వ్యాక్సిన్ మిగిలి ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న కారణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియను క్రమబద్ధీకరించుకుని ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -