- Advertisement -
తిరుమల: తిరుమల ఆలయంలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. నిన్న శ్రీవారిని 20,850 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి 10,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.2.45 కోట్లు కానుకల రూపంలో వచ్చినట్టు టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు వెల్లడించారు.
Huge Devotees visited Tirumala Temple
- Advertisement -