- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ఉన్నత విద్య శాఖ కార్యదర్శిగా గత నెల పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అమిత్ ఖరే ప్రధాని నరేంద్ర మోడీకి సలహాదారుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులయ్యారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ మంగళవారం తెలియచేసింది. జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అమిత్ ఖరే గత నెల(సెప్టెంబర్) 30న పదవీ విరమణ చేశారు. రెండేళ్ల పదవీ కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆయనను ప్రధాని సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఈ బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వులో సిబ్బంది శాఖ పేర్కొంది.
- Advertisement -