Friday, November 22, 2024

వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుపై గగ్గోలు

- Advertisement -
- Advertisement -

Rajasthan Marriage Bill

జైపూర్:  సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో ఆమోదించిన తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తిప్పి పంపమని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కోరతానని సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. బాల్య వివాహంతో సహా వివాహాలన్నింటినీ క్రమబద్ధీకరించేలా ‘రాజస్థాన్ తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్(సవరణ)బిల్లు 2021’ని సెప్టెంబర్ 17న ఆమోదించారు. ఇది అంతకు ముందున్న 2009నాటి వివాహ చట్టంకు సవరణ. “మేము ఆమోదించిన బిల్లును న్యాయశాఖ చేత పరీక్షింపదలిచాము. కనుక దానిని గవర్నరు తిప్పి పంపాక పరిశీలించి, అవసరమైతే ముందుకు తీసుకెళతాము” అని అశోక్ గెహ్లాట్ జైపూర్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్నారు.

2009 చట్టం సెక్షన్ 8ని సవరించే ప్రతిపాదన ఈ కొత్త బిల్లులో ఉంది. దీనిప్రకారం వివాహ రిజిస్ట్రేషన్ కు ‘విధిగా మెమోరాండం సమర్పించాలి’ అన్నది గగ్గోలుకు కారణమైంది. 2021 సవరణ చట్టం ప్రకారం 21 ఏళ్లు నిండిన వరుడి తల్లిదండ్రులు లేక సంరక్షకులు, అలాగే 18 ఏళ్లు నిండిన వధువు తల్లిదండ్రులు లేక సంరక్షకులు బాధ్యతగా మెమోరాండంను సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా ప్రిస్క్రయిబ్డ్ పద్ధతిలో, పెళ్లయిన 30 రోజుల్లోగా రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
వివాహ వయస్సును మార్చడం వల్ల తాము కేంద్ర ప్రభుత్వ చట్టం పద్ధతిలో చట్టం ఉండేలా చూడనున్నామని గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం చెబుతోంది. వివాహ రద్దును, బాధితులను వేగంగా గుర్తించేందుకు బాల్య వివాహ రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందని ఆయన ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఈ సవరణ బిల్లుపై బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్షం, పౌర సమాజం, మహిళా సంస్థలు, బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ రచ్చ చేస్తున్నాయి. ఇది బాల్య వివాహాలను చట్టబద్ధం చేయగలదని వాదిస్తున్నాయి. ప్రభుత్వ విమర్శకులు ఈ బిల్లు బాల్య వివాహాలను రిజిస్ట్రేషన్ మూలకంగా గుర్తించేలా ఉంటుందని విమర్శిస్తున్నాయి.
గెహ్లాట్ మాత్రం ఇది తమ ప్రభుత్వ గౌరవానికి సంబంధించిన అంశం కాదని, సుప్రీంకోర్టు ఉత్తర్వును దృష్టిలో పెట్టుకునే ఈ సవరణ బిల్లును తెచ్చామని అన్నారు. “పెళ్లి చేసుకునే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందేనని సుప్రీంకోర్టు తెలిపిందని, కనుక రిజిస్ట్రేషన్ తప్పనిసరి” అని గెహ్లాట్ వివరించారు. సీమా, అశ్వనీ కుమార్ కేసులో సుప్రీంకోర్టు 2006 ఫిబ్రవరిలో ‘ఏ మతానికి చెందిన వారైనప్పటికీ భారతీయ పౌరులందరూ తప్పనిసరిగా తమ వివాహాన్ని తమ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’ అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News