- Advertisement -
కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకింది. రెండు మూడు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి గంగుల హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని మంత్రి సూచించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి గంగుల ప్రచారం చేస్తున్న క్రమంలో ఆయనకు కరోనా సోకింది. కాగా, ఇదివరకే ఓసారి కరోనా బారిన పడిన మంత్రి గంగులకు మరోసారి కరోనా సోకింది.
Gangula Kamalakar tests positive for Covid 19
- Advertisement -