Tuesday, November 26, 2024

లఖింపుర్ ఖేరి ఘటన… రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

Congress Leaders meet with President

 

ఢిల్లీ: లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్‌ మిశ్రను తొలగించాలని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా పదవిలో ఉన్నంత కాలం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదన్నారు. ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతులు, ఎస్సిలు, మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి సానుకులంగా స్పందించారని, కేంద్ర ప్రభుత్వంతో ఈ వ్యవహరాన్ని చర్చిస్తానని హామీ ఇచ్చారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News