- Advertisement -
ముసోరి: కరోనా విజృంభణ సమయంలో ఢిల్లీలోని స్పెషల్ కొవిడ్ ఆస్పత్రిలో సేవలందించిన 38 మంది డాక్టర్లు భారత్ చైనా సరిహద్దు రక్షక దశంలో చేరారు. అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో మెడికల్ ఆఫీసర్లుగా వీరు నియామకమయ్యారు. శనివారం సైనిక కవాతు సందర్భంగా ఈ చేరిక జరిగింది. 24 వారాల పాటు పోరాట శిక్షణ పొందిన తరువాత దళంలో చేరారని ఐటిబిపి అధికార ప్రతినిధి తెలిపారు. ముసోరి లోని పారామిలిటరీ ఫోర్సు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన సైనిక కవాతు వందనాన్ని ఐటిబిపి డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా స్వీకరించారు. ఇప్పుడు చేరిన డాక్టర్లలో 14 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ఆయుధాల వినియోగం, వ్యూహాల రూపకల్పన, నిఘా సమాచార సేకరణ, ఫీల్డు ఇంజినీరింగ్, మేప్ రీడింగ్ తదితర అంశాల్లో వీరు శిక్షణ పొందారని అరోరా తెలిపారు.
- Advertisement -