- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో నిండు కుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 64.168 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోండగా, అదేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.80 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.
2 Gates Opened at Nagarjuna Sagar Dam
- Advertisement -