- Advertisement -
న్యూడిల్లీ : దసరా సందర్భంగా ఎయిమ్స్ హాస్టల్ ఆవరణలో రామాయణ హాస్యనాటికను ప్రదర్శించడం, అది వీడియో ప్రసారం కావడంపై అనేక విమర్శలు రావడంతో ఎయిమ్స్ విద్యార్థి అసోసియేషన్ క్షమాపణ చెప్పింది. రామాయణ ఘట్టం లోని కొన్ని పాత్రలను ఆధునిక పోకడలో వ్యంగ్యంగా ప్రదర్శించడం పలు విమర్శలకు దారి తీసింది. ఇది ఎవరినో బాధపెట్టడానికి, లేదా ఎవరికో ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో ప్రదర్శన జరగలేదని వివరించింది. ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్‌తో దీనిపై చర్చించిన తరువాతనే ఈ క్షమాపణ ట్వీట్ ద్వారా వెలువడింది.
- Advertisement -