Saturday, November 23, 2024

సాగ‌ర్ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

 Nagarjuna Sagar Project Crest Gates Closed

న‌ల్ల‌గొండ: నాగార్జున సాగ‌ర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గింది.దీంతో సాగ‌ర్ జలాశయం క్రస్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 45,578 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోండగా, అదేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 589.90 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుత నీటినిల్వ 311.74 టీఎంసీలుగా ఉంది.

 Nagarjuna Sagar Project Crest Gates Closed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News