బెంగళూరు: సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరు ప్రాంతం అన్నపూర్ణేశ్వరినగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోలారు జిల్లా మాలూరు చెందిన ఓ మహిళ బెంగళూరులోని ఓ వస్త్రదుకాణంలో పని చేస్తోంది. అక్కడ తమిళనాడు చెందిన భాస్కర్ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. మాలూరుకు వెళ్లినప్పుడు వివాహేతర సంబంధంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆమెను బెంగళూరు వద్దని భర్త హెచ్చరించిన కూడా అతడికి తెలియకుండా తన కుమారుడితో కలిసి వెళ్లిపోయింది. ఆమె తన ప్రియుడ్ని కలిసిన విషయం ఆమె కుమారుడు మేనమామ మునిరాజుకు ఫోన్లో చెప్పాడు. మునిరాజు తన స్నేహితులతో కలిసి ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెను ఆటోలో పంపించాక భాస్కర్‌పై దాడి చేశాడు. బాస్కర్ ఘటనా స్థలంలో చనిపోగానే శవంతో సహా పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు.
సోదరితో అక్రమ సంబంధం… శవంతో పిఎస్ లో లొంగిపోయిన నిందితులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -