టిటిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ ధ్వజం
మనతెలంగాణ/ హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రప్రభుత్వం పెత్తనాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టిటిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల చేతగానితనం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొదట 49 ప్రాజెక్టులని ఇప్పుడు 15కు రావడం వెనుక ఏ రాజకీయం జరిగిందన్నారు. కృష్ణానదిలో నీటి లభ్యత ప్రకారం వాటాలు పంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించుకునే సమస్యను ఢిల్లీ స్థాయిలో బోర్డుకు తీసుకెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.బోర్డుల నిర్వహణకు రూ 200కోట్లు ఇవ్వండి, రూ 300కోట్లు ఇవ్వండని కేంద్రం కోరడం హాస్యాస్పదంగాఉంది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాయలసీమలో 4జిల్లాలు, తెలంగాణలో 4జిల్లాలు ఎడారిగా మారుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతాంగానికి నష్టం జరగకుండా తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది. నీటిపై కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.