- Advertisement -
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక సేవల శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కారద్ సోమవారం ముంబైలోని ఎల్‌ఐసి సెంట్రల్ ఆఫీస్‌ను సందర్శించారు. ఎల్‌ఐసి చైర్‌పర్సన్ ఎం.ఆర్.కుమార్, మేనేజింగ్ డైరెక్టర్లు సిద్ధార్థ మొహంతి, మిని ఇపె, బి.సి.పట్నాయక్‌లు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భగవత్ ప్రజలకు బీమా ప్రయోజనాలు ఏవిధంగా లబ్ధిని చేకూరుస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఐసి బ్రాండ్ ఇమేజ్‌పై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రపంచ బీమా సంస్థల్లో ఒకటిగా ఎల్‌ఐసి స్థానం దక్కించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -