Monday, November 18, 2024

జీనా యహా… మర్‘ నా’ యహా

- Advertisement -
- Advertisement -

non-local laborers shot dead in Srinagar

శ్రీనగర్‌లో స్థానికేతర కూలీల వెత
చావు కన్నా ఆకలి భయానకం
స్థానికుల ఆదరణతో కదిలిపోలేం

శ్రీనగర్ : ‘ఇక్కడ ఇప్పుడు బతుకు భయం వెంటాడుతోంది. అయితే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లలేం. వెళ్లం, ఇక్కడ దక్కే కూలీ డబ్బులు ఎక్కువ. స్థానికులు దయగలవారు’ అని కశ్మీర్ శ్రీనగర్‌లో స్థానికేతర బీహారీ కూలీ సంజయ్ కమార్ చెప్పారు. ఇటీవలి కాలంలో శ్రీనగర్‌లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలను ఎంచుకుని వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న ఘటనలు దాదాపుగా నిత్య అకృత్యాలు అయ్యాయి. ఈ విధంగా ఇప్పటికే బీహార్, యుపి ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు వలస కూలీలు బలి అయ్యారు. బీహార్ ఇతర దూర ప్రాంతాల నుంచి కూలీలు కశ్మీర్‌కు పనుల కోసం మార్చి తొలివారంలో వస్తుంటారు. వడ్రంగి, పొలం పనులు , వెల్డింగ్, రాళ్లకు నగిషీలు వంటి పనులు చేస్తూ చలికాలం ఆరంభం వరకూ అంటే నవంబర్ తొలివారం వరకూ ఉండి వెళ్లుతుంటారు.

ఇందులో నైపుణ్య, అనైపుణ్య కార్మికులు కూలీలుఅనేకులు ఉంటారు. దాదాపుగా ఎక్కువ మంది బీహార్ నుంచే వచ్చిపోతుంటారు. అయితే ఈసారి ఈ వలసకూలీలకు ఉగ్ర యమగండం ఎదురైంది. ఇప్పుడు ఇక్కడ ఘటనలతో వణుకుపుడుతోందని , అయితే ఇప్పటికిప్పుడు తిరిగి బీహార్‌కు వెళ్లడం లేదని బీహారీ కూలీ 45 ఏండ్ల శంకర్ నారాయణ్ తెలిపారు. సంజీవ్ కుమార్, శంకర్ నారాయణ్ వంటి వారిలో అత్యధికులు బీహార్‌కు చెందిన వారే. తాను ప్రతి ఏటా ఈ సీజన్‌లోనే గత 15 ఏండ్లుగా ఇక్కడికి వస్తున్నట్లు, ఇక్కడి జనం ఇక్కడి గల్లీలు ఆచార వ్యవహారాలు తనకు పాతనే అని శంకర్ నారాయణ్ చెప్పారు. ఇంతకాలం తాను ఉన్నదశలో ఇక్కడ స్థానికుల నుంచి తనకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడలేదన్నారు. జనం కలగొలుపువారు. ఆదుకునే రకం. ఇంతకు ముందు లోయలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు కూడా ఇక్కడి వారు తాము బాధపడ్డారు కానీ బయటి నుంచి వచ్చిన వారిని ఆదరించారని గుర్తు చేసుకున్నారు.

ఇతర ప్రాంతాలలో ఇక్కడి కూలీ డబ్బులు దొరికితే తాము ఇక్కడికి ఇంతదూరం ఎందుకు వస్తామని వలసకూలీలు తెలిపారు. తాను ఇంతకు ముందు ఓ సారి ఉపాధికోసం మలేసియా వెళ్లానని, అయితే అక్కడ ఉండలేక తిరిగి లోయకు వచ్చానని ఓ కూలీ తెలిపారు. ఇక్కడ తాము ఆదరణ పొందుతామని చెప్పారు. పరాయిదేశాలలో నిర్మాణ, సేవల పనులలో ఉన్న వారిని తక్కువ చేసి చూస్తారని, సరైన వేతనాలు కూడా ఇవ్వరని, పైగా ఈసడింపులు ఉంటాయని సంజయ్‌కుమార్ తెలిపారు. ఇక యుపికి చెందిన వడ్రంగి రియాజ్ అహ్మద్ తానే కాదు తన కుటుంబం అంతా యుపి నుంచి ఇక్కడికి తరలివచ్చిందని , ఇక్కడ జీవితం బాగా ఉందని తెలిపారు. తాను చెక్కపని చేస్తానని, భార్య ఇండ్లలో పనులకు వెళ్లుతుందని, ఈ విధంగా తాము ఇప్పుడు ఇక్కడనే ఓ ఇల్లు కొనుక్కునే స్థితికి వచ్చామన్నారు. తరువాత తన స్వరాష్ట్రం యుపిలోని సహ్రాన్‌పూర్‌లో కూడా కనీసం స్థలం అయినా తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలపై స్పందిస్తూ వీటితో చావు భయం అయితే అవుతుంది. అయితే చావు కన్నా ఆకలి భయం భీకరంగా ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News