Saturday, November 23, 2024

బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -
Dalits Fires on Etela Rajender
దళితబంధును ఆపినందుకు బిజెపి తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
ఆన్ గోయింగ్ పథకాలను ఆపిన దాఖలాలు ఇంతవరకూ లేవు : మంత్రి కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య
ఈటలపై మండిపడుతున్న దళితులు

మన తెలంగాణ/హైదరాబాద్: దళితబంధు ప థకం హుజూరాబాద్‌లో నిలిపివేయడంలో రాజకీయ కుట్ర ఉందని మం త్రి కొప్పుల ఈశ్వర్ ఆ రోపించారు. సోమవా రం రాత్రి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ పథకం నిలిపివేయ డం ద్వారా దళిత సమాజానికి జరిగిన ద్రోహంగా భావించాలన్నారు. ఈ బడ్జెట్‌లోనే దళితబంధు పథకానికి నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని బిజెపి నేతలు ఎందుకు లేఖ రాశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకురాలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ పథకాన్ని నిలిపివేసేలా చేసి మరోవైపు కె సిఆర్‌పై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని కొప్పు ల ఈశ్వర్ మండిపడ్డా రు. దళితబంధు పథకా న్ని నిలిపివేసిందుకు గాను ఈటల వ హించాలన్నారు. రాజకీయ ప్రోద్భలంతోనే ఇసి నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

దళితబంధును నిలిపివేసి పదల పొట్ట కొట్టారాన్నారు. చరిత్రలో ఏనాడు కూడా ఆన్‌గోయింగ్ స్కీమ్‌ను నిలిపివేయలేదని ఆయన గుర్తు చేశారు. దళితబంధు ఆపడం బిజెపి కుట్ర అని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఇందుకు ఆ పార్టీ తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఆన్‌గోయింగ్ పథకాలను ఆపిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు ప్రారంభించిందన్నారు. అయినప్పటికీ దీనిపై బిజెపి నేతలు రాజకీయం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం సిగ్గుచేటన్నారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత బంధు ఆపడం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చర్య అని వ్యాఖ్యానించారు.

దళిత బంధు ఆపేందుకు బిజెపి కుట్ర పన్నిందని.. దళిత బంధు ఆపాలంటూ ఈసీకి నేతలు ఫిర్యాదు చేశారన్నారు. బిజెపి ఫిర్యాదుతో దళితబంధు ఆఫాలంటూ ఇసి ఆదేశించిందని విమర్శించారు. ఇది బడ్జెట్‌లో ప్రక టించిన కార్యక్రమమని, ఆన్‌గోయింగ్ స్కీమ్‌ను ఇసి ఎలా ఆపుతుందని ప్రశ్నించారు. బిజెపిది ఓర్వలేని తనమని మండిపడ్డారు. దళిత ఆగ్రహానికి బిజెపి గురికాక తప్పదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొదట్నించీ బిజెపి నేతలు దళితబంధు పథకంపై అవాకులు, చవాకులు పేలుతూ వస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎలాగైనా దళితబంధుని నిలుపుదల చేయాలని బిజెపి భావిస్తూ వచ్చిందన్నారు. ఆ క్రమంలో బిజెపి కుట్రకు తెగబడిందని ఆరోపించారు.

దళితబంధును ఆపాలని లేఖ రాసిన బిజెపి నేత ఈటల రాజేందర్‌పై దళిత వర్గాలు ఆగ్రహాజ్వాలలు వ్యక్తపరుస్తున్నాయి. బడ్టెట్‌లో ప్రకటించి ఆన్‌గోయింగ్ స్కీమ్‌గా ఉన్న దళితబంధుని ఇసి ఎలా ఆపుతుందని దళితవర్గాలు నిలదీస్తున్నాయి. ఈసి నిర్ణయంపై దళిత వర్గాలు బిజెపి నేతల తీరుని బాహాటంగానే తప్పుబడుతున్నారు. నోటికి అందివచ్చిన దాని ని బిజెపి నేతలు అందకుండా చేశారని దళిత వర్గాలు మండిపడ్డాయి. ఇసి సైతం ఫిర్యాదు అందిన వెంటనే దళితబంధు ఆపడంపై సైతం దళితవర్గాలు భగ్గుమంటున్నాయి. రానున్న కాలంలో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బిజెపి నేత ఈటల, కేంద్రంపై దళిత వర్గాలు అక్కసు వెళ్లగ్రక్కుతున్నాయి. దళిత బంధు పథకం తమకు అందకుండా చేసిన బిజెపి నేతలను ప్రచారానికి వస్తే తరిమికొడతామని ఈ సందర్భంగా దళితవర్గాలు ఖరాకండిగా తేల్చిచెప్పాయి. వాళ్లు ఇవ్వరు.. ఇచ్చేవాళ్లపై ఈ కడుపు మం ట ఎందుకు? అని బిజెపి నేతలను ప్రశ్నిస్తున్నారు.

దళితుల అభివృద్ధిని ఓర్వలేని బిజెపి… డా. ఎర్రోళ్ల శ్రీనివాస్

అత్యంత పేదరికంలో మగ్గుతున్న దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా కెసిఆర్ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే దళిత బంధు పథకం తీసుకురాగా బిజెపి నాయకులు దళితుల ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారన్నారు పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల కుటుంబాలకు దళిత బంధు సహాయం అందాల్సి ఉండగా దళిత బంధు గ్రౌండ్ అయితే బిజెపికి రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి ఆపించారన్నారు.

బిజెపి దళితులకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. బిజెపి సిద్ధాంత పరంగానే దళితులకు బద్ధ వ్యతిరేకి… దళితులను సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేయడమే బిజెపి ఎజెండా .. మన పొట్టగొట్టిన బిజెపికి రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. దళితుల అభివృద్ధి ఆపే ఏజెండాతో పనిచేసే బిజెపి జండాను మన దళితవాడల్లో లేకుండా చేయాలని తెలిపారు. దళిత సమాజం మేల్కొవల్సిన సమయం ఇదని, మన అభివృద్ధిని అడ్డుకునే బిజెపికి అందరం ఒక్కటై గుణపాఠం చెప్పాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News