Saturday, November 23, 2024

కశ్మీరు మాజీ మంత్రి ప్రేమ్‌సాగర్ అజీజ్ ఎన్‌సికి రాజీనామా

- Advertisement -
- Advertisement -

Former Kashmir minister Prem Sagar Aziz resigns from NC

జమ్మూ: జమ్మూ కశ్మీరు మాజీ మంత్రి ప్రేమ్ సాగర్ అజీజ్ మంగళవారం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సి)కు రాజీనామా చేశారు. ఎన్‌సిని వీడి ఇటీవలే బిజెపిలో చేరిన మరో మాజీ మంత్రి దేవేందర్ సింగ్ రాణాకు అజీజ్ మద్దతు పలికారు. పార్టీ తరఫున బని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అజీజ్ తన మద్దతుదారులతో కలసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 45 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న తాను రాణా కోసమే ఎన్‌సిలో చేరానని, జమ్మూ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న రాణాకు తాను నిర్దంద్వంగా మద్దతు తెలియచేస్తున్నానని ఆయన చెప్పారు. జమ్మూ కోసం ఎన్‌సితో రాణా తెగతెంపులు చేసుకున్న కారణంగా తాను కూడా పార్టీలో కొనసాగలేనని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడైన రాణా అక్టోబర్ 10న ఎన్‌సికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News