Friday, November 22, 2024

సిపిసి టిబెట్ అధ్యక్షునిగా వాంగ్ జుంజెంగ్ నియామకం

- Advertisement -
- Advertisement -

Wang Junzheng as CPC Tibet President

బీజింగ్: జింజియాంగ్‌లో ఉయిగర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, కెనడా నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న వాంగ్ జుంజెంగ్ చైనా కమ్మూనిస్టు పార్టీ టిబెట్ విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారు. వూ ఇంగ్జీ స్థానంలో టిబెట్ అటానమస్ రీజనల్ కమిటీకి కమ్మూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సిపిసి) కార్యదర్శిగా వాంగ్ జుంజెంగ్‌ను నియమించినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువ మంగళవారం తెలిపింది. జింజియాంగ్ ప్రాంతానికి పార్టీ డిప్యుటీ కార్యదర్శిగా, భద్రతాధిపతిగా పనిచేసిన కాలంలో 58 ఏళ్ల వాంగ్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో ఆయనపై అమెరికా, బ్రిటన్, ఇయు, కెనడా ఆంక్షలు విధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News