Friday, November 22, 2024

ప్రతిపక్షాలు లేకుండా చేయాలని జగన్ కుట్ర: ఏపి కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయం, టిడిపి నేతల ఇళ్లపై అధికార పార్టీ వైసిపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు సరికాదు. తమకు ఎదురు చెప్పేవారు ఉండకూడదని ముఖ్యమంత్రి దాడులకు సైతం వెనుకాడటం లేదు. రాజకీయ పార్టీలు అన్న తరువాత ఎవరి పార్టీ సిద్దాంతాలు వారికి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ పార్టీ సిద్దాంతం రౌడీయిజం. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాక మరేంటి?. ఏపి పోలీస్ శాఖ.. వైసిపి పోలీస్ శాఖగా మారింది. అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు. జరిగిన తప్పును తప్పు అని చెబుతున్న నాపై కూడా రేపు వైసిపి కార్యకర్తలు దాడి చేసిన ఆశ్చర్యం లేదు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. టిడిపి కార్యాలయాలు, టిడిపి నేతల ఇంటిపై దాడికి దిగిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి” అని డిమాండ్ చేశారు.

AP Congress denied YCP Activists attack on TDP Offices

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News