అక్కినేని నాగచైతన్య, సమంత జంట విడాకులు అభిమానులను షాక్‌కి గురి చేసిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత సమంత కెరీర్‌పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. టాలీవుడ్లో తన కెరీర్ ఇక ముగిసినట్టేనని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అందుకే ఇప్పుడు ఈ భామ తమిళం, హిందీ సినిమాలపైనే శ్రద్ధ పెడుతోందని కూడా గుసగుసలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పాన్ ఇండియా కాన్సెప్టులు అయితేనే తనకు ఆదరణ ఉంటుందని సామ్ భావిస్తోందట. సమంత ఇటీవల ఓ తమిళ నిర్మాణ సంస్థకు సంతకం చేయడమే కాకుండా తెలుగులో శ్రీదేవి మూవీస్ సినిమాకి సంతకం చేసింది. కానీ షూటింగుల పరంగా కొన్ని షరతులు విధిస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఏదేమైనా తెలుగులో ప్రతికూల వాతావరణం ఉంటుందని భావిస్తోంది కాబట్టి తమిళం, హిందీలో కెరీర్‌ని బెటర్‌గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల సమంత ప్లానింగ్ ఆ దిశగానే సాగిపోతోందని ఇకపై అంగీకరించే ప్రాజెక్టులకు పాన్ ఇండియా అప్పీల్ ఉండాలని ఆమె భావిస్తోందట.
Samantha Focus on Tamil and Hindi Movies