- Advertisement -
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడడంతో ప్రభుత్వం బుధవారం రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది. ఓ సీనియర్ అధికారి ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. “ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి కరోనా కర్ఫూకు సంబంధించిన ఆదేశాలు రావడంతో రాష్ట్రంలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూను ఎత్తివేశాము” అని హోమ్‌శాఖకు చెందిన అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత అధికారులందరికీ పంపారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా కేసులు బుధవారం నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 112 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1687048 మంది రోగులు రికవర్ అయినట్లు ఓ సీనియర్ హెల్త్ అధికారి తెలిపారు.
- Advertisement -