Sunday, November 24, 2024

పానీపూరీ తిని 77 మందికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

77 people ate panipuri and fell ill

రాజ్‌నాధ్‌గావ్ (చత్తీస్‌ఘడ్ ): చత్తీస్‌గఢ్ లోని గటపార్‌కాలా గ్రామంలో పానీపూరీ తిని 77 మంది అస్వస్థులయ్యారు. వీరిలో 57 మంది చిన్నారులు ఉన్నారు. గ్రామంలో నిర్విహించిన మార్కెట్‌లో పానీపూరీ తినడమే దీనికి కారణం. తొలుత మెడికల్ సెంటర్‌కు, తరువాత ఆస్పత్రికి వీరిని తరలించారు. ఆహారం విషమయం కావడం వల్లే ఇది జరిగిందని అధికారులు తెలిపారు. కడుపునొప్పి, వాంతులతో వీరు సతమతమయ్యారు. వారిలో 26 మంది చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News