Friday, November 15, 2024

సమంత పిటిషన్… విచారించనున్న కూకట్ పల్లి కోర్టు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన విడాకులపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై నటి సమంత పరువు నష్ట దావా పిటిషన్ వేసింది. డాక్టర్ వెంకట్ రావు తో పాటు మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ పైనా పరువు నష్టం దావా వేసింది. అక్టోబర్ 2న వివాహ బంధం నుండి విడిపోతున్నట్లు సమంత, నాగ చైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా సమంత నాగ చైతన్య ప్రకటన చేశారు. సమంతపై డాక్టర్ వెంకట్ రావు ఆరోపణలు చేశారు.   కొన్ని యూట్యూబ్ చానల్స్ లో డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ ప్రసారమైంది. తన పరువు కి నష్టం కలిగించేలా డాక్టర్ వెంకట్ రావు ఇంటర్వ్యూ ఇవ్వడం పై సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు లేనిపోని ఎఫైర్లు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసిన వెంకట్ రావు పై డిఫర్మేషన్ షూట్ చేసింది. వెంటనే యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా నుండి ఆ లింకులు డిలీట్ చేయించాలని పిటిషన్ లో పేర్కొంది. తన విడాకుల గురించి అసత్య ప్రసారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును సమంత కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News