అమెరికా, బ్రిటన్‌లో భారీగా కేసులు నమోదు
భయపెడుతున్న కొత్త వేరియంట్, పాక్‌లోనూ వ్యాప్తి
న్యూఢిల్లీ : కరోనా ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దానికి కారణం బ్రిటన్, అమెరికాలో రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని దేశాలలో కరోనా విజృంభణ తగ్గినా మరి కొన్ని దేశాలలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. యుకెలో రోజు 50 వేల కేసులు నమోదు అవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు నమోవుతున్నాయి. డెల్టా ఉత్పరివర్తనాలే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. క్యాలిఫోర్నియాలో ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కాలిఫోర్నియాలో మొదట గుర్తించిన కారణంగా దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ వల్లనే అమెరికా, బ్రిటన్‌లలో విపరీతంగా వ్యాప్తి చెంది రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి మరియు కరోనా మరణాలు సంఖ్య కూడా అధికంగానే ఉంది.
అయితే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్లను మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో కూడా గుర్తించారు. పాకిస్తాన్‌లో ఈ వేరియంట్ వల్లనే కేసులు అధికంగా పెరుగుతున్నాయని పాక్ ఆరోగ్య శాఖ పేర్కొంది. ఎప్సిలాన్ వేరియంట్ గా పిలిచే కోవిడ్ వేరియంట్‌లో ఐదు రకాల వేరియంట్లను గుర్తించగా, ఈ వేరియంట్ కు సంబందించిన ఏడు మ్యూటేషన్లను పాక్ లోనే గుర్తించటం ఆందోళనకు గురి చేస్తుంది. మళ్లీ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే ఇంకా కరోనా శకం ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.