Monday, November 25, 2024

టిఆర్‌ఎస్‌కు సాటిలేదు

- Advertisement -
- Advertisement -

Minister KTR Hold Meeting With Constituency Leaders

సిఎం కెసిఆర్ శ్రమ, పార్టీ శ్రేణులు అంకితభావంతో చేసిన కృషి ఫలితం
జాతీయ పార్టీలు సైతం టిఆర్‌ఎస్ దరిదాపుల్లో
నిలబడలేవు పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే ఎవరికైనా
రాజకీయ భవిష్యత్తు ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త
గుర్తుంచుకోవాలి పదవుల్లో ఉన్నవారు, అవి రానివారు
అంతా పార్టీకి సమానమే టిఆర్‌ఎస్‌కు 60లక్షల
మంది సభ్యత్వం ఉంది అందరికీ పదవులు ఇవ్వలేం
అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు
విజయగర్జన సభ చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తాలి
విజయగర్జన సన్నాహక సమావేశంలో మంత్రి కెటిఆర్
దశలవారీగా అందరికీ పదవులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్ పార్టీ ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కఠోర శ్రమ, పార్టీ శ్రేణుల అంకితభావం దాగుందన్నారు. దీని కారణంగానే టిఆర్‌ఎస్ ఇప్పుడు బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోందన్నారు. జాతీయ పార్టీలు సైతం సంస్థాగతంగా మన పార్టీకి సమాన స్థాయిలో నిలబడ లేని పరిస్థితి నెలకొందన్నారు. సన్నాహాక సమావేశాలలో భాగంగా నాలుగవ రోజైన గురువారం తెలంగాణ భవన్‌లో మెదక్, అందోల్, నర్సాపూర్, పటాన్‌చెరువు, నారాయణఖేడ్, జగిత్యాల, మంథని, వేములవాడ, మానుకొండూరు, భువనగిరి, ఆలేరు, మునుగోడు, కోదాడ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కెసిఆర్ నాయకత్వంలో కార్యకర్తలు గులాబి జెండాను భుజాలపై మోస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

అయితే పార్టీ పటిష్టంగా ఉన్నప్పడే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. దీనిని ప్రతి కార్యకర్త గుర్తుకుపెట్టుకోవాలన్నారు. దశల వారిగా నాయకులందరికి పార్టీ పదవులు లభిస్తాయన్నారు. పదవులు వచ్చిన వారు…పదవులు రాని వారు అంతా పార్టీకి సమావమేనని అన్నారు. పదవులను అందరికి ఇవ్వలేమన్నారు. టిఆర్‌ఎస్‌కు అరవై లక్షల మంది సభ్యత్వం ఉందన్నారు. కాని పదవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు. అందుకే అందరికి పదవులు ఇవ్వలేమన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి నేతకు పార్టీ పరంగా తగిన గుర్తింపునస్తామన్నారు. ఇందులో ఎవరికి, ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని కెటిఆర్ పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ తలపెట్టిన విజయ గర్జన సభ చూసి ప్రతిపక్షాలకు లాగులు తడవాలన్నారు. ఆ స్థాయిలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చే విధంగా చూడాలన్నారు. అలాగే నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా… నేతలంతా సమన్వయం చేసుకుని పనిచేయాలని కెటిఆర్ సూచించారు.

చిన్న అంశాన్ని పెద్దగా చేసుకుని మీడియాకు ఎక్కవద్దని సూ చించారు. అలాగే సిఎం కెసిఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు అర్హులైన వారికి అందేలా పార్టీ శ్రేణు లు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పొరపాటున అసలైన లబ్ధిదారులకు కూడా అన్యాయం జరుగుతున్న దాఖలాలు ఉన్నాయన్నారు. ఆ విషయంలో పార్టీ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే సిఎం కెసిఆర్ ప్రధాన లక్షమన్నారు. ఆ దిశగా పార్టీ నేతలంతా పనిచేయాలని కెటిఆర్ సూచించారు. నేతలంతా నిరంతరం ప్ర జల సమక్షంలోనే ఉంటా స్థానిక సమస్యలను సంబంధిత అధికారులు, ఎంఎల్‌ఎల దృష్టికి తీసుకోవాలన్నారు. అప్పటికి సమస్య పరిష్కా రం కాని పక్షంలో జిల్లా మంత్రుల దృష్టికి తీసుకోపోవాలన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు నోరు, నీరు లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగా ణ ప్రజలకు సరైన గౌరవం దక్కిందన్నారు.

టిఆర్‌ఎస్ మొదటి అధికారంలోకి వచ్చినప్పటికీ రెండవ సారి మరిన్ని అధికంగా సీట్లను సాధించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వాస్తవానికి అధికారంలోకి పార్టీ రెండవ సారి గెలిస్తే కొన్ని సీట్ల సంఖ్య తగ్గుతాయని…కానీ సిఎం కెసిఆర్ జనరంజకమైన పాలన అందిస్తున్న కారణంగానే రెండువ సారి అధికంగా సీట్ల సంఖ్య పెరిగిందన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అ మలుకు నిదర్శమని కెటిఆర్ అన్నారు. అసెం బ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 105 మంది శాసనసభ్యులు గెలుపొందగా, 32 జి ల్లా పరిషత్తులకు 32 గెలుచుకుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

జెండాలను ఆవిష్కరించాలి

విజయ గర్జన సభకు బయలుదేరే ముందు వారి వారి గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరించి బయలుదేరాలని మంత్రి కెటిఆర్ సూ చించారు. దీంతో ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు రెపరెపలాడుతాయన్నారు. ఇది పా ర్టీ మూడవ సారి జైత్రయాత్రకు శ్రీకారం చు ట్టాలని ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, సిఎం రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి,మెదక్, శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సోములు, రెడ్డి, జెడ్‌పిడిసిలు, ఎంపిపిలు, పార్టీ నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News