ప్రకటన విడుదల చేసిన నగర సిపి అంజనీకుమార్
ఈ నెల30వ తేదీ వరకు అవకాశం
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దివాళీకి ఫైర్ క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిపావళీకి పటాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులకు ఆయా జోన్లకు చెందిన డిసిపిలు లైసెన్స్‌లు తాత్కాలిక ప్రాతిపదికన మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లైసెన్స్ కోసం https;//www.tspolice.gov.in orhttp;//eservives.tspolice.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు ఈ నెల 30వ తేదీలోపున చేసుకోవాలి, ఈతేదీలోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే అంగీకరిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుకు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్‌ఓసి, ప్రభుత్వ భూమి అయితే ఎంసిహెచ్ అధికారుల అనుంచి అనుమతి, ప్రైవేట్ భూమికి యజమాని నుంచి అనుమతి, గతంలో జారీ చేసిన లైసెన్స్ కాపీ, సింగిల్ షాపు అయితే పక్కన ఉన్నవారి అనుమతి, సైట్ ప్లాన్‌ను జత చేయాలని కోరారు. దరఖాస్తు చేసుకునే వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, గన్‌ఫౌండ్రీ శాఖ పేరుతో రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు.