ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ప్రకటన విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రైల్వే జోన్‌ల పరిధిలో టికెట్ రిజర్వేషన్‌లలో ఇబ్బందులు ఎదురవుతాయని రైల్వే శాఖ పేర్కొంది. తూర్పు రైల్వే విడుదల చేసిన సమాచారం ప్రకారం, కోల్‌కతాలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్‌ఎస్) డేటా సెంటర్‌లో డౌన్‌టైమ్ యాక్టివిటీ కారణంగా టికెట్ రిజర్వేషన్ సర్వీస్ అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. డౌన్ టౌన్ కార్యక్రమంలో భాగంగా నేటి రాత్రి 11.45 నుంచి అక్టోబర్ 24 ఉదయం 5 గంటల వరకు టికెట్ రిజర్వేషన్ వ్యవస్థ పనిచేయదని అదికారులు తెలిపారు. ఈ సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, విచారణ సహా అన్ని సేవలు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పనిచేయవని రైల్వే శాఖ తెలిపింది. ఈ సమయంలో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో పాటు టికెట్ బుకింగ్ సాధ్యం కాదని రైల్వే శాఖ తెలిపింది.