కోల్‌కతా నుంచి బాలికను తీసుకువచ్చిన నిందితుడు
అరెస్టు చేసి బెంగాల్ పోలీసులకు అప్పగింత
మనతెలంగాణ, హైదరాబాద్ : హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి బాలికను ఉమెన్‌సేఫ్టీ వింగ్ అధికారులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం…పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక(17)ను హ్యుమన్ ట్రాఫికింగ్ ద్వారా నగరానికి తీసుకు వచ్చారని కోల్‌కతా పోలీసులు తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డిజి స్వాతీలక్రాకు సమాచారం అందించారు. కోల్‌కతాకు చెందిన సంటు పరమానిక్ బాలికను వ్యభిచారం కోసం నగరానికి తీసుకుని రావడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖనకుల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ సపోర్ట్, సిడిఆర్ ఆధారంగా బాధిత బాలిక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్సై హరీష్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీసులతో మాట్లాడి బాలిక వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే నిందితుడు, బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు. బాలికను సఖీ కేంద్రానికి తరలించగా, నిందితుడిని కోల్‌కతా పోలీసులకు అప్పగించారు.