Friday, September 20, 2024

గెల్లును గెలిపించుకుందాం.. అభివృద్ధిని సాధించుకుందాం: గంగుల

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్: ‘గెల్లును గెలిపించుకుందాం.. అభివృద్ధిని సాధించుకుందాం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు కోసం శనివారం హుజురాబాద్ 22వ వార్డు, అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను స్థానికులతో పాటు పట్టణ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, డాక్టర్లు పెద్ద ఎత్తున కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంఘీబావాన్ని తెలియజేసారు. ఈ సందర్బంగా గంగల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బిజెపి అసమగ్ర విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతుందని, అన్ని అంశాల్లో విఫలమై దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. ఓవైపు ప్రైవేటీకరణ పేరిట భారీగా ప్రజా ఆస్థులను  ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ మరోవైపు రోజు రోజుకు పెట్రోల్, గ్యాస్ ధరల్ని పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి రూపాయి తీసుకుంటూ దాన్లో సగం కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్న పార్టీ బిజెపి అని అన్నారు. ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కానీ వారి కేంద్ర మంత్రులు కానీ హుజురాబాద్ కు, తెలంగాణకు ఏం చేస్తామో చెప్పకుండా మభ్యపెట్టో జూటా మాటల్ని వల్లే వేస్తున్నారని, అన్నింట్లో తమ వాటా అని చెప్పే వ్యక్తులు దళితబందులో ఎందుకు వాటా ఇవ్వరో ప్రశ్నించాలన్నారు. పది లక్షల రూపాయల్ని కెసిఆర్ గారు ధళితబందు కోసం ఇస్తుంటే చేతనైతే వాటికి మరో పది లక్షలు అధనంగా కేంద్రం నుండి ఇప్పించాల్సింది పోయి కంటగింపుతో దాన్ని ఆపించిన బీజేపీకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులు ఎలా బతుకాలో చెప్పాలన్నారు. సామాన్యుల్ని దోచి బడాబాబులకు దేశాన్ని అప్పజెప్పే పచ్చి అవకాశ వాదుల్ని తరిమేయాలన్నారు. యాదాద్రిలో నభూతో నభవిష్యత్ లా శ్రీ లక్ష్మీనర్షింహస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్న టీఆర్ఎస్ కన్నా భక్తులు ఎవరుంటారని, కేవలం మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్పా వారికి ఏం చేసారని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. విజ్ణులైన ప్రజలు అన్నీ ఆలోచిస్తారని టీఆర్ఎస్ కు కంచుకోట అయిన హుజురాబాద్లో గతం కన్నా భారీ మెజార్టీతో కేసీఆర్ బలపర్చిన గెల్లు గెలువబోతున్నారన్నారు. ఈనెల ముప్పైన జరిగే ఓటింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని మంత్రి గంగుల కోరారు.

Gangula Kamalakar Election Campaign in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News