Friday, September 20, 2024

ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడతవు రాజేందర్?: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao speech in Huzurabad election campaign

హూజూరాబాద్: మనకు సాయం చేసే చేయి ఏది.. మనకు అన్నం పెట్టే వారు ఎవరు.. అన్నది ఆలోచించాలని, పని చేసే వాళ్లు ఎవరు అనేది చూడాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం జమ్మికుంట రూరల్ నాగం పేటలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”అబద్దాల బీజేపీకి, నమ్మకాల టీఆర్ఎస్ కు మధ్య పోటీ జరుగుతుంది. అబద్దాలు చెప్పే బీజేపీ కావాలా…నమ్మకాలు నిలబెట్టే టీఆర్ఎస్ కావాలా ఆలోచించండి. ఈటల గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు. ఆయన తన స్వార్థం కోసం బీజేపీలోకి వెళ్లాడు. 57 ఏండ్లకు రూ.2016 పెన్షన్ ఇచ్చే బాధ్యత గెల్లుది, నాది. లక్ష రూపాయల రుణ మాపీ మిత్తితో సహా కేసీఆర్ సాయంతో చేస్తాం. ఇళ్లు కట్టేందుకునేందుకు స్వంత జాగ ఉన్న వారికి 5 లక్షలు ఇప్పిస్తాం. రాజేందర్ ఒక్క ఇళ్లు కట్టలేదు.30వ తేదీన గ్యాస్ కు దండం పెట్టి, బీజేపిని బొంద పెట్టు- కారు గుర్తుకు ఓటు కొట్టు. రాజేందర్.. బొందపెడతా, కూలగొడతా, అంతు చూస్తా, ఘోరీ కడతా అంటున్నడు తప్ప ప్రజలకు పైసా పనికి వచ్చేది చెబుతున్నడా. రాజేందర్ ప్రభుత్వాన్ని కూలగొడతవా.. రూ.2016 పెన్షన్ ఇచ్చినందుకు కూలగొడతవా. రైతులకు 10 వేలు రైతు బంధు ఇచ్చినందుకు కూలగొడతావా.

ఆడపిల్లలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిందుకు కూలగొడతవా. బాయిల కాడ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు కూలగొడతవా. ఢిల్లీలో మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది. బాయిల కాడ మీటర్లు పెడతట, మార్కెట్లు పీకేస్తరట, దొడ్డు వడ్లు కొనమంటున్నరు.. ఇందుకు మీకు ఓటు వేయాలా.  డిజీల్ పెంచి రైతుల ఉసురు పోసుకుని, గ్యాస్ ధర పెంచి అక్కా చెల్లెల్ల ఉసురు పోసుకున్న పార్టీకి ఓటు వేయాలా. జనం గెలావాలంటే కారుకు, రాజేందర్ ఒక్కడు గెలావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. గెల్లుకు రెండు గుంటల భూమి ఉంది. ఆస్థి లేదు. ఉద్యమ కారుడు. రాజేందర్ కు అహంకారం ఉంది. ఎకరం అమ్ముతా ఎన్నికలు గెలుస్తా.. ఇది అహంకారం కాదా.ఆరు సార్లు గెలిస్తే 17 ఏల్లు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క మహిళా భవనం కట్టలేదు. నేను ప్రతీ ఊర్లో కట్టించిన. వడ్డీ లేని రుణం ఇవ్వలేదు. పోయి పోయి జూటా పార్టీ బీజేపీలో చేరిండు. ఆ నీళ్లు బాగా వంటపట్టినయి. అన్నీ అబద్దాలు ఆడుతున్నడు. బట్ట కాల్చి మీద వేస్తున్నరు. కుట్రలు చేస్తున్నరు. ఈవారం రోజులు బీజేపీ ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో ఉండండి. మంచి తనంతో, ప్రేమతో గెలుద్దాం” అని పేర్కొన్నారు.

Harish Rao speech in Huzurabad election campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News