మన తెలంగాణ,సిటీబ్యూరో: కన్‌స్ట్రక్షన్ వరల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి చేరారు. ముంబైల్‌లో నిర్వహించిన 7వ భారతీయ నిర్మాణ రంగం పండగ రజతోత్సవ వేడుకల్లో వెల్లడించారు. కన్‌స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆప్‌ద ఇయర్ 2020గా వెలుగొందుతున్న కెవీబీరెడ్డి ఇతర కన్‌స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్స్ పాటుగా పరిశ్రమకు అందించిన తోడ్పాటుకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఈగుర్తింపు అందుకోవడం గురంచి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ సీఈఓ కెవీబీరెడ్డి మాట్లాడుతూ ఈగుర్తింపునందించిన కన్‌స్ట్రక్షన్ వరల్డ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ అత్యుత్తమ సమాచారం, కనెక్షన్స్ అందిస్తూ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కన్‌స్ట్రక్షన్ వరల్డ్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలో మహోన్నత వ్యక్తుల సరసన నిలువడమే ఓగౌరవం, బాధ్యత అన్నారు. నా వెనుక శిలలా తోడుండి, అవిశ్రాంతంగా తోడ్పాటునందించిన మా బృందానికి ఈగుర్తింపు అంకిత చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బృందమే మహమ్మారి విసిరిన సవాళ్లను సైతం అధిగమించి ముందుకు సాగడంలో తోడ్పాడటంతో పాటుగా మా ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన రవాణా అవకాశం అందించిందన్నారు…
ఎల్‌అండ్ టీ గ్రూప్‌లో 2018లో చేరిన దగ్గర నుంచి హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఎన్నో విజయాలను కెవీబీరెడ్డి తీసుకొచ్చారు. సేకరణ, ప్రాజెక్ట్ కో ఆర్డినేషన్, డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, నిర్వహణ, పరిశ్రమ అభివృద్ది, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ , ఈపీసీ ప్రాజెక్టు ఫైనాన్సింగ్, కమర్షియల్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వంటి రంగాలలో మూడున్నర దశబ్దాల అనుభవం ఆయనతో పాటు తీసుకువచ్చారు. కెవీబీరెడ్డి పలు అవార్డులను వ్యక్తిగత, వృతిపరంగా అందుకున్నారు. ఆయన అందుకున్న ఇతర అవార్డులలో ఇనిస్టిట్యూట్ ఆప్ ఎకనమిక్స్ స్టడీస్ నుంచి 2018,2019లలో ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు వంటివి కూడా ఉన్నాయి.