- Advertisement -
వాషింగ్టన్: వాయువ్య సిరియాలో శుక్రవారం డ్రోన్ దాడిలో అల్ ఖైదా సీనియర్ నాయకుడు ఒకరిని హతమార్చినట్లు అమెరికా సైన్యం శనివారం ప్రకటించింది. డ్రోన్ దాడిలో అల్ ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్-మాతర్ మరణించిట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ తెలిపారు. అల్-మాతర్ మరణంతో వివిధ దేశాలలో దాడులు జరిపేందుకు కుట్రలు పన్నే సామర్ధం అల్ ఖైదా కోల్పోయిందని, ఇది అమెరికా పౌరులతోపాటు మిత్ర దేశాలకు, అమాయక పౌరులకు ఊరటనిచ్చే విషయమని ఆయన చెప్పారు. సిరియాతోపాటు ఇరాక్, తదితర దేశాలపై దాడులు జరిపేందుకు సిరియాను స్థావరంగా అల్ ఖైదా వాడుకుంటోందని ఆయన చెప్పారు.
- Advertisement -