ఢాకా:బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టిన కీలక నిందితుడు కోర్టు ముందు తన తప్పును అంగీకరించాడు. షైకత్ మండల్ అనే ఆ నిందితుడు ఆదివారం మెజిస్ట్రేట్ ముందు తన నేరాన్ని అంగీకరించాడు. తన ఫేస్ బుక్ పోస్ట్ కారణంగానే పీర్‌గంజ్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని రంగ్‌పూర్‌లో అక్టోబర్ 17న దుర్గా పూజా వేడుకలప్పుడు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అంగీకరించాడు. అతడి ఫేస్‌బుక్ పోస్టే అతడిని పట్టించింది. షైకత్, అతడికి తోడ్పడిన 36 ఏళ్ల మతపెద్ద రబీవుల్ ఇస్లాం లూటీ, దహనకాండలకు కారకులయ్యారు. వారు రంగ్‌పూర్ మెజిస్ట్రేట్ దిల్‌వర్ హుస్సేన్ ముందు హాజరయ్యారని కోర్టు అధికారి తెలిపారు. వారిని డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పోలీసులు శుక్రవారం గాజిపూర్‌లో అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం అక్టోబర్ 17న దాదాపు 70 హిందువుల ఇళ్లు తగలబెట్టబడ్డాయి. లౌడ్‌స్పీకర్ ద్వారా వదంతులు వ్యాపింపజేయడంలో షైకత్ మండల్‌కు రబీవుల్ ఇస్లాం తోడ్పడ్డా డు అని ఓ పోలీసు అధికారి తెలిపాడు.
బంగ్లాదేశ్ మతకల్లోలం కీలక నిందితుడి నేరాంగీకారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -