కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
రష్యాలో మళ్లీ రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు విధులకు స్వస్తి
మాస్కో: రష్యాలో మరోసారి రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు సోమవారం నమోదయ్యాయి. దీంతో ఈ వారం తరువాత నుంచి ప్రారంభమయ్యే పనులకు దూరంగా ప్రజలు ఉండాలని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. గత 24 గంటల్లో కొత్తగా 37,930 కేసులు నమోదైనట్టు రష్యా ప్రభుత్వ టాస్క్ ఫోర్సు వెల్లడించింది. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇదే భారీ సంఖ్యగా పేర్కొంది. అలాగే గత 24 గంటల్లో 1069 మరణాలు సంభవించాయని, వారాంతంలో మరణాల సంఖ్య 1075 కన్నా ఇది కాస్త తక్కువని పేర్కొంది. దేశం మొత్తం మీద శెలవు దినాలను పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తుందని, ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ప్రజలు పనులకు వెళ్ల రాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా తీవ్రంగా ఉన్న 85 రీజియన్లలో పనిచేయరాని కాలం వేగంగానే ప్రారంభమౌతుందని, దీన్ని నవంబర్ 7కు మించి పొడిగించడమౌతుందని పుతిన్ వివరించారు.
ఈ సమయంలో కీలకమైన మౌలిక సర్వీసులు, ఇతర అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు తప్ప మిగతా చాలా ప్రభుత్వసంస్థలు, ప్రైవేటు వ్యాపారాలు పనిచేయడం ఆపివేస్తాయని తెలిపారు. గురువారం నుంచి పనినిలిపివేసే సమయాన్ని ప్రారంభించడానికి మాస్కో అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది. జిమ్స్, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు , స్టోర్సు 11 రోజుల పాటు మూసివేస్తారు. కిండర్ గార్టెన్స్, స్కూల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు మాత్రం సర్వీసు చేయడానికి వీలుగా పనిచేస్తాయి. ఫుడ్‌స్టోర్స్, ఫార్మసీలు పనిచేస్తాయి. ఎవరైతే పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నామని తమ స్మార్టు ఫోన్ల డిజిటల్ వేదిక ద్వారా నిరూపిస్తారో వారికి మాత్రం పరిమితంగా మ్యూజియంలు, సంగీత కార్యక్రమాల హాల్స్, థియేటర్లు, తదితర వేదికలతో నవంబర్ 7 తరువాత అనుసంధానం కలిగిస్తారు. కార్యాలయాలను మూసివేసి, ప్రజారవాణాను రద్దు చేసి ప్రజలకు ఏకాంత సమయం కల్పించడం వల్ల వైరస్‌ను చాలా వరకు నిరోధించే అవకాశం కలుగుతుందని రష్యా అధికార యంత్రాంగం భావిస్తోంది.
మొత్తం మీద రష్యాలో ఇంతవరకు 8.2 మిలియన్ కరోనా నిర్దారణ కేసులు నమోదయ్యాయి. 2,31,669 మరణాలు సంభవించాయి. యూరప్ దేశాలన్నిటికన్నా ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువ. ప్రపంచ స్థాయిలో అయిదోస్థానం పూచిస్తోంది. వ్యాక్సినేషన్ తక్కువగా జరగడం, ప్రజలు కరోనా నిబంధనలు సరిగ్గా పాటించక పోవడమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రష్యా మొత్తం జనాభా 146 మిలియన్ మందిలో మూడో వంతు అంటే 45 మిలియన్ మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ పొందారు. ప్రపంచ దేశాలన్నిటి లోనూ రష్యా ఒక్కటే మొదటిసారి స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను 2020 ఆగస్టులో అందించిన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అయితే అందుబాటు లోకి తీసుకురావడంలో విపరీత జాప్యం ప్రభుత్వం వల్ల జరిగిందన్న ఆరోపనణలు ఉన్నాయి.
Russia Reports record daily Corona Cases and deaths