మన తెలంగాణ ,సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బిఎంఎస్( భారతీయ మజ్దూర్ సంగ్ ఆఫ్ తెలంగాణ) అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రాజు వర్మ, ప్రధాన కార్యదర్శి టి. రాంరెడ్డి, కారదర్శి విష్ణు వందన తదితరులు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ దేశంలో ఉన్న ప్రభుత్వ,పబ్లిక్, రంగ సంస్థలను వ్యతిరేకిస్తుందని, దీన్ని తాము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బొగ్గు రంగం ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని, డిఫెన్స్ ఆర్డినెన్స్ రంగం కార్పోరేటేకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక మార్పులు నిలిపివేసి కార్మికుల సంక్షేమాని అనుకూల సవరణ చట్ట చేయాలన్నారు, గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ దర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు,ఉద్యోగులు, పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.