- Advertisement -
మన తెలంగాణ/చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో టేకు కలప పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అటవీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లెనిన్‌కాలనీ సమీపంలో టేకు కలపతో వెళ్తున్న ఎపి 10 పి 2437నంబర్ గల మారుతి కారును పట్టుకుని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు శ్రీను అనే వ్యక్తితో పాటు కారు, 33 వేల రూపాయాలు విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన టేకు కలప ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం టేకులేరు ప్రాంతానికి చెందినదిగా గుర్తించినట్లు తెలిపారు. కలప తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -