- Advertisement -
న్యూఢిల్లీ : తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు బహుళ ఇంధన ఎంపికలను ఆఫర్ చేస్తూ తొలిసారిగా జియోబిపి పెట్రోల్ పంప్‌ను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బిఎంఎల్) ప్రారంభించింది. బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్), ఎనర్జీ దిగ్గజం బిపి జాయింట్ వెంచర్ మంగళవారం ఈ ప్రకటన చేసింది. ఈ పెట్రోల్ పంప్‌ను నవీ ముంబైలోని నవ్డేలో ప్రారంభించారు. ఈ పెట్రోల్ పంప్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌లతో సహా వివిధ ఇంధన ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. 2019 సంవత్సరంలో రిలయన్స్‌కు చెందిన 1,400 పెట్రోల్ పంపులు, 31 ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) స్టేషన్‌లలో బిపి 49 శాతం వాటాను కొనుగోలు చేసింది.
- Advertisement -