Saturday, November 23, 2024

పెగాసస్ స్పైవేర్‌పై విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు!

- Advertisement -
- Advertisement -
Pegasus Spyware
స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం కోర్టు రూలింగ్
ప్రభుత్వం ప్రతిసారి ‘దేశ భద్రత’  పేరుతో మినహాయింపు పొందజాలదు

న్యూఢిల్లీ: ఇజ్రాయేల్ తయారుచేసిన పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఈ సంవత్సరం జులైలో మీడియా రిపోర్టులు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో అనధికారిక నిఘా పెడుతున్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీని నియమించింది. పెగాసస్ స్పైవేర్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ 12 పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్‌వి రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక సభ్యులతో కూడిన ఈ కమిటీ అనధికార నిఘాకు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను విచారించనుంది.

ఈ టాస్క్‌లో జస్టిస్ రవీంద్రన్‌కు 1976 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ మాజీ అధికారి అలోక్ జోషి, సబ్ కమిటీ చైర్మన్ సుదీప్ ఓబ్రాయ్ సాయపడతారు. ఇక కమిటీలోని ముగ్గురు టెకికల్ సభ్యులుగా సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ ప్రొఫెసర్ నవీన్ కుమార్ చౌదరి, స్కూల్ ఆఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ పి. ప్రబాహరన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్ ప్రొఫెసర్ అశ్విన్ అనిల్ గుమస్తే ఉండనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కమిటీ ఈ విచారణ, దర్యాప్తు జరిపి ఈ అంశాలను నిర్ధారించనుందని తెలిపారు. అవి:
1.భారత పౌరులపై, వారిఫోన్లపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారా? వారి స్టోర్డ్ డేటాను పొందారా?; 2. ఆ స్పైవేర్ దాడికి గురైన బాధితులు/వ్యక్తుల వివరాలు; 3.భారతీయుల వాట్సాప్ అకౌంట్లు హ్యాకయినట్లు 2019లో రిపోర్టులు ప్రచురితమయ్యాక రెస్పాండెంట్ అయిన భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?; 4. భారత కేంద్రప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వాలు,ఏదైనా ప్రభుత్వ సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను పొందాయా?; 5. ఒకవేళ దేశంలోని ఏదేని సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించినట్లయితే ఏ చట్టం, మార్గదర్శకత్వం, ప్రొటోకాల్, చట్టప్రక్రియ కింద దానిని వినియోగించారు?, 6. ఒకవేళ దేశీయ సంస్థ/వ్యక్తి ఆ స్పైవేర్‌ను ఉపయోగించనట్లయితే, అలా ఉపయోగించడానికి అధికారం ఇచ్చారా?; 7. పెగాసస్‌కు సంబంధించిన ఇతర అనుబంధ విషయాలు ఏవైనా విచారణ, దర్యాప్తు చేయాల్సి ఉన్నాయా? వంటి విషయాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కమిటీని నిర్దేశించింది. ఇదిలావుండగా దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయట్లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News