Saturday, November 23, 2024

బిజెపితో ఒప్పందం ఉండదు.. అది గాడ్సే పార్టీ: హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి గాడ్సే పార్టీ అని, ఆ పార్టీతో ఎప్పుడు ఒప్పందం ఉండదని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను ఎవరు పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. మోడీని కలిసిన సిఎం కెసిఆర్ ధరల పెంపుదలపై ఎందుకు అడగలేదు. గతంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 50 రూపాయల భారం భరించింది. ఇక్కడ కూడా ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం పేదల భారం భరించాలి. కెసిఆర్ తో ఎక్కడ లొల్లి వచ్చిందో ఈటెల చెప్పాలి. ఈటెల గెలిస్తే ధరలు తగ్గిస్తాడా. మా అభ్యర్థి విద్యార్థి నాయకుడు.. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా” అని పేర్కొన్నారు.

V Hanumantha Rao press meet at Gandhi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News