యాదాద్రి: ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడారు. రూపాయి కూడా వృధా చేయకుండా ఆర్థికంగా బలోపేతం కావాలని, దేశానికే ఆదర్శంగా నిలిచేలా వాసాలమర్రి దళితులు సమగ్రాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. మరోసారి వాసాలమర్రి దళితులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని గొంగిడి సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సి కార్పొరేషన్ ఇడి శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపిటిసి నవీన్‌తో పాటు తుర్కపల్లి మండల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పలువురు లబ్ధిదారులు, పాల్గొన్నారు.
దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది: సునీత
- Advertisement -
- Advertisement -
- Advertisement -