Saturday, November 23, 2024

కొత్త పార్టీ పెడతా: కెప్టెన్ అమరీందర్ సింగ్

- Advertisement -
- Advertisement -
Amarinder Singh
బిజెపితో సీట్ల సర్దుబాటు ఉంటుంది!

చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెడతానని పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. “బిజెపితో మేము సీట్ల సర్దుబాటు చేసుకుంటాం…బిజెపితో పొత్తు పెట్టుకుంటాం అని నేనైతే చెప్పలేదు” అని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.“అవును, నేను పార్టీ పెడుతున్నాను. పార్టీ పేరు ఏమి పెట్టాలని ఇంకా అనుకోలేదు. ఎన్నికల సంఘం మాకు ఏ చిహ్నం ఇస్తుందో వేచి చూద్దాం. నా లాయర్లు ఆ పనిలోనే ఉన్నారు” అని కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.

“పార్టీ ఆవిర్భావం ప్రకటించాక మేము మొత్తం 117 సీట్లకు పోటీచేస్తాం. మా పార్టీలోకి అనేక మంది కాంగ్రెస్ వారు వస్తారు” అని కూడా ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన తన నాలుగున్నర ఏళ్ల పాలనను సమర్థించుకున్నారు. అంతేకాక రాష్ట్రంలో బిఎస్‌ఎఫ్ పరిధిని 5 కిమీ నుంచి 50 కిమీ. పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా సమర్థించారు. పాకిస్థాన్, ఖాలిస్థానీలు సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. డ్రోన్ దాడులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఆయుధాలు జారవిడవడానికి కూడా డ్రోన్లను వాడుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News