Saturday, November 23, 2024

తిన్న రేవు తలవాలి… కారు గుర్తుకే ఓటెయ్యండి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రధాన మంత్రి సొంత రాష్ట్రము గుజరాత్ లో ఇస్తున్నది వృద్దులకు వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొదటిసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినపుడు రూ. 200 ఉన్న పింఛన్ రూ. వెయ్యి చేశామని, మరోసారి 2016 చేసామని తెలిపారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ లో టిఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారం కల్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు మొదట ఎస్సీలను మాత్రమే అమలు చేసాం, అప్పుడు రూ 50 వేలు మాత్రమే ఇచ్చినాం, కొంచెం చేయి తిరిగిన తర్వాత అందరికి అమలు చేశాం, ప్రస్తుతం రూ. లక్ష 116 రూపాయలు ఇస్తున్నామన్నారు.

ఐదు నెలల నుండి ప్రచారం జరుగుతోంది. ఈరోజు ప్రచారం చివరి రోజు. రాత్రి ఏడూ గంటల నుండి మైకుల చప్పుడు ఉండదు. కోలాటం అక్కాచెల్లెళ్ల ముఖాలు ప్రచారం చేసి ఎండలో తిరిగారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే కళ వచ్చింది. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ 25 వేల మెజారిటీతో గెలవబోతున్నారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

ఈరోజు ప్రచారం చివరి రోజు.. అందరి మాటలు విన్నారు. ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు. ఎవరి వల్ల పనులు జరుగుతాయి అన్నది అలోచించి ఓటు వేయాలి. అందరు చెప్పింది వినాలి. కానీ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. తిన్న రేవు తలవాలి అన్నారు పెద్దలు. ఆలా తెలిస్తేనే… నీయతి, బర్కత్ ఉంటది 2016 రూ. పింఛన్ ఇచ్చింది కారు, కెసిఆర్ కాదా? అని ప్రజలను హరీష్ అడిగారు.

మైనారిటీలకు షాదీ ముబారక్ సిఎం ఇస్తున్నారని, మైనారిటీ విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో గురుకుల పాఠశాలలు సిఎం కెసిఆర్ పెట్టారని, ఒక్కో విద్యార్ధి పేరు మీద రూ. లక్ష ఏడాదికి ఖర్చు చేస్తున్నాం  రైతులకు రూ. లక్ష మాఫీ వచ్చే బడ్జెట్లో మాఫీ చేస్తామని. 57 ఏళ్లకే పింఛన్ కూడా ప్రారంభిస్తాం. దళిత బందును అమలు చేస్తామన్నారు. కెసిఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానలో డెలివరీ చేసి రూ. 12 వేల రూపాయలు ఇచ్చి ఇంటి దగ్గర దింపుతున్నది కెసిఆర్ ప్రభుత్వం అని హరీష్ ప్రశంసించారు.

జమ్మికుంటలో డాక్టర్ల మీటింగ్ పెడితే.. డాక్టర్లు చెప్పారు.. కెసిఆర్ కిట్ ప్రథకం పెట్టిన తర్వాత మాకు గిరాకీ తగ్గిందని. అందరూ సర్కారు దవాఖానలపై వెళ్తున్నారని, గతంలో 15 డెలివరీలు చేసేవాళ్ళమని, ఇప్పుడు ఒకటి రెండు కూడా రావడం లేదని చెబుతున్నారని, కెసిఆర్ పెట్టిన పథకం మంచి ఫలితం ఇచ్చినప్పుడు నా మనసుకు సంతోషం కలిగిందన్నారు.

70 ఏళ్ల పాలనలో రైతులకు డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, రైతులతో నీటి తీరువా, భూమి శిస్తు కట్టించారని, కానీ రైతుబంధు ఇస్తూ రైతుకు శిస్తు కడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని, ఉచిత కరెంటు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని అడిగారు.

ఎండాకాలం యాసంగి పంట వేయాలంటే రైతులు నీళ్లు లేక బాధపడేవాళ్లు. మొఖాన్ని మొగులుగు పెట్టి చూసేవాళ్ళు అనుమానం మీద నారు పోసేవాళ్ళని, పొట్టకు వచ్చే వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయేవన్నారు. షెట్టర్లు పగులగొట్టేవాళ్ళని, కాలువలు తెగ్గొట్టేవాళ్ళు అని, ఎవరైనా కాలువకు మోటార్లు పెడితే ఎమ్మార్వో ఆఫీసు వాళ్ళు వచ్చి పైపులు కోసేవాళ్ళు… మోటార్లు జీపులో వేసుకుపోయేవాళ్లు, ధర్నాలు చేసేవాళ్ళు… ఇప్పుడు ఆ బాధలు ఉన్నాయా? బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. నీళ్లు ఇక చాలు. బంద్ చేయండి అనే దాకా ఇస్తున్నామన్నారు.

వెనుకటి ఎవరైనా పెద్దలు చనిపోతే బొక్కలు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లలో కలిపి సీసాల్లో నీళ్లను తెచ్చుకునేవాళ్ళమని, వంద తాటిచెట్ల లోతున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే బిజిగిరి షరీఫ్ నడి ఊళ్ళో నుండి నీళ్లు పోతున్నాయా? లేదా? అని అడిగారు.  ఈ ఘనత టిఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News