- Advertisement -
మావ్(యుపి): వచ్చే ఏడాదిలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) పొత్తు కుదర్చుకున్నాయి. రాష్ట్రం నుంచి బిజెపిని తరమికొట్టడమే ధ్యేయంగా తమ కూటమి పనిచేస్తుందని ఆ రెండు పార్టీలు బుధవారం ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన ఖేలా హోబే(ఆట మొదలైంది) నినాదంతో బిజెపినిఆ రాష్ట్ర ప్రజలు తరిమికొట్టారని, తమ కూటమి ఇస్తున్న ఖడేదా హోవే(తరిమికొడదాం) నినాదంతో అసెంబ్లీ ఎన్నికలలో యుపి నుంచి బిజెపి తరిమివేత ఖాయమని ఎస్‌బిఎస్‌పి అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యానించారు.
- Advertisement -