- Advertisement -
మన తెలంగాణ / మెట్పల్లి: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు గత మూడు రోజులుగా శరీరం నలతగా ఉండడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ రావడంతో, తనతో ప్లీనరీలో కలిసిన వారందరిని కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో టిఆర్ఎస్ నాయకుల్లో కరోనా భయాందోళనలు నెలకొని కరోన టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం.
- Advertisement -